News October 3, 2024
మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM

TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్‌లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.
Similar News
News March 15, 2026
నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.
News March 15, 2026
అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 15, 2026
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు!

ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in


