News October 3, 2024

గిఫ్టులు అక్క‌ర్లేదు.. రైతుల‌కు హ‌క్కులు కావాలి: రాహుల్ గాంధీ

image

దేశంలోని రైతులు ఉచిత బ‌హుమ‌తుల‌ను కోరుకోవ‌డం లేద‌ని, వారి హ‌క్కుల‌ను మాత్ర‌మే కోరుకుంటున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, అంబానీల రుణాల‌ను మాఫీ చేసిన‌ప్పుడు, రైతుల‌వి కూడా మాఫీ చేయాల‌న్నారు. హ‌రియాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ అదానీ పోర్టుల్లో వేల కిలోల డ్ర‌గ్స్ దొరికినా మోదీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. హరియాణా పిల్ల‌ల భ‌విష్య‌త్తును అదానీ నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

Similar News

News October 9, 2024

వడ్డీరేట్లు తగ్గించని RBI..

image

అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.

News October 9, 2024

భర్త మృతి.. మరణమైనా నీతోనే అంటూ భార్య ఆత్మహత్య

image

AP: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో నాగరాజు చనిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసి ఉష గుండె తల్లడిల్లింది. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుంది.

News October 9, 2024

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్‌కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది.