News October 3, 2024
గిఫ్టులు అక్కర్లేదు.. రైతులకు హక్కులు కావాలి: రాహుల్ గాంధీ
దేశంలోని రైతులు ఉచిత బహుమతులను కోరుకోవడం లేదని, వారి హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, అంబానీల రుణాలను మాఫీ చేసినప్పుడు, రైతులవి కూడా మాఫీ చేయాలన్నారు. హరియాణా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అదానీ పోర్టుల్లో వేల కిలోల డ్రగ్స్ దొరికినా మోదీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. హరియాణా పిల్లల భవిష్యత్తును అదానీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 12, 2024
గోవాలో మినీ ‘సిలికాన్ వ్యాలీ’: పీయూష్
గోవాను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపించే గోవా చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఉన్న 23 పారిశ్రామిక ప్రాంతాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి’ అని గుర్తుచేశారు. సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్ పరిశ్రమలకు గోవాను కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.
News November 12, 2024
మా అబ్బాయి రికార్డుల కోసం చూడడు: శాంసన్ తండ్రి
తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.
News November 12, 2024
19న OTTలోకి థ్రిల్లర్ మూవీ
మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది.