News October 4, 2024
హార్దిక్ బౌలింగ్పై కోచ్ మోర్కెల్ అసంతృప్తి!

బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ కోసం ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి భారత జట్టులో చేరనున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసిన తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి డెలివరీ తర్వాత హార్దిక్ దగ్గరికి వెళ్లి సలహాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 6న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Similar News
News November 10, 2025
సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.
News November 10, 2025
ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

AP: హైస్కూల్ ప్లస్లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
News November 10, 2025
ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.


