News October 4, 2024

హార్దిక్ బౌలింగ్‌పై కోచ్ మోర్కెల్ అసంతృప్తి!

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి భారత జట్టులో చేరనున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసిన తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి డెలివరీ తర్వాత హార్దిక్ దగ్గరికి వెళ్లి సలహాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 6న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News December 11, 2025

భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత వాతావరణ శాఖ(<>IMD<<>>)లో 134 ప్రాజెక్ట్ సైంటిస్ట్ , సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 14వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి MSc, BE, B.Tech, PhD, ME, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mausam.imd.gov.in/

News December 11, 2025

సెకండరీ డిస్‌మెనోరియాని ఎలా గుర్తించాలంటే?

image

ప్రైమరీ డిస్‌మెనోరియా అంటే రజస్వల అయినప్పటి నుంచి పీరియడ్స్ రెండు రోజుల్లోనే నొప్పి ఉంటుంది. కానీ సెకండరీ డిస్‌మెనోరియాలో నెలసరికి ముందు, తర్వాత కూడా తీవ్రంగా నొప్పి వస్తుంది. దీంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్లు, కలయిక సమయంలో నొప్పి, బ్లీడింగ్‌లో మార్పులు ఉంటాయి. కాబట్టి సెకండరీ డిస్‌మెనోరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 11, 2025

కోనేటి రాయడి కునుకు కొద్దిసేపే.. అదీ మన కోసమే!

image

1933కి ముందు శ్రీవారికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి విశ్రాంతి సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామి నేడు అర్ధరాత్రి దాటినా భక్తుల మొర వింటున్నాడు. ఏడు కొండలు ఎక్కిన మనకు సంతోషాన్ని పంచడానికి ఆ ఏడు కొండలవాడు అలుపు లేకుండా దర్శనమిస్తున్నాడు. ఇంతటి కరుణ చూపే స్వామీ.. నీకెప్పుడూ రుణపడి ఉంటాం!