News October 5, 2024
హర్షసాయిపై లుక్‌అవుట్ నోటీసులు

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.
News January 13, 2026
క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.
News January 13, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


