News October 5, 2024

హర్షసాయి‌పై లుక్‌అవుట్ నోటీసులు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

శని దోషాలు ఎన్ని రకాలు?

image

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.

News December 7, 2025

21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్

image

AP: రాష్ట్రంలో 21 లక్షల BCల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు CS విజయానంద్ తెలిపారు. ‘7.48 లక్షల SC, ST వినియోగదారుల ఇళ్లపైనా 2 కిలోవాట్ల చొప్పున 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సెట్లను అమర్చాలి. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ సిస్టమ్స్, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చిలోగా ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు సూచించారు.

News December 7, 2025

రైతులకు అలర్ట్.. పంటల బీమా చెల్లించారా?

image

AP: PM ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. రబీకి సంబంధించి DEC 15లోపు టమాటా, వేరుశనగ, 31లోపు వరి సాగు చేసే రైతులు ప్రీమియం కట్టాలి. మామిడి రైతులకు JAN 3వరకు గడువుంది. భూమిపత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, కామన్ సర్వీస్ ఇన్యూరెన్స్ పోర్టల్‌లో బీమా కట్టొచ్చు. పంట రుణాలున్న రైతులు నేరుగా బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించొచ్చు.