News October 6, 2024
ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.
Similar News
News January 14, 2026
బదోనే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్

సీనియర్లను కాదని వాషింగ్టన్ సుందర్ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు <<18835903>>ఆయుష్ బదోని<<>>ని సెలక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరణ ఇచ్చారు. ఇండియా-A టీమ్‌లో బదోని పర్ఫార్మెన్స్ బాగుందని.. IPLలోనూ రాణించినట్లు గుర్తుచేశారు. రైట్-ఆర్మ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ అయిన బదోని.. సుందర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయగలడని భావించినట్లు వివరించారు.
News January 14, 2026
దూడల్లో నట్టల బెడద – ఈ జాగ్రత్తలు తీసుకోండి

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.
News January 14, 2026
పండుగల్లో ఇలా రెడీ..

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.


