News October 6, 2024
ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.
Similar News
News November 6, 2024
తాతా.. ఐ లవ్ యూ.. ట్రంప్ మనవరాలి సంతోషం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన డొనాల్డ్ ట్రంప్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనవరాలైన కై మాడిసన్ ట్రంప్ విషెస్ తెలిపారు. ‘అమెరికన్ల కోసం మీలా ఎవరూ కష్టపడి పని చేయరు. అభినందనలు తాత, ఐ లవ్ యూ’ అని ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ -వెనెస్సా కుమార్తెనే ఈ కై. చదువుకుంటూనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు.
News November 6, 2024
అయిపోయాడనుకున్నారు.. కానీ!
2017లో US అధ్యక్షుడైన ట్రంప్ 2021లో బైడెన్ చేతిలో ఓడారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ నిరసనల్లో అల్లర్లు జరిగి ఆయనపై కేసులయ్యాయి. ఓ పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బిచ్చిన కేసు సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ట్రంప్ కథ ముగిసిందని భావించారు. కానీ మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగారు. ప్రచారంలో ఆయనపై కాల్పులూ జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ అవుతున్నారు.
News November 6, 2024
IPL: వేలంలో అత్యధిక ధర పలికేదెవరు?
ఈ నెలాఖరులో ఐపీఎల్-2025 వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 1,574 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ వేలంలో అత్యధిక రేటు ఎవరు పలుకుతారని ప్రశ్నిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. దీనికి పంత్ అత్యధిక ధర పలుకుతారని ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో బట్లర్, బౌల్ట్, అయ్యర్, రాహుల్ పలకవచ్చని చెబుతున్నారు. మీరు ఎవరని అనుకుంటున్నారో కామెంట్ చేయండి?