News October 6, 2024
5G యూజర్లకు VoNR

మొబైల్ నెట్‌వర్క్ LTE, <<14288058>>VoLTE<<>> నుంచి VoNRకు అప్డేట్ అయిపోయింది. ప్రస్తుతం ఇండియాలో 5G యూజర్లకు వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అందుబాటులో ఉంది. ఇది హై-డెఫినిషన్ ఆడియో, వాయిస్ నాణ్యతతో పాటు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. రియల్ టైమ్ కమ్యూనికేషన్‌కు సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకకాలంలో వాయిస్& డేటా ట్రాన్స్‌మిషన్‌ను అనుమతిస్తుంది.
Similar News
News March 17, 2026
‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 17, 2026
వంటింటి చిట్కాలు

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.
News March 17, 2026
ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.


