News October 6, 2024

5G యూజర్లకు VoNR

image

మొబైల్ నెట్‌వర్క్ LTE, <<14288058>>VoLTE<<>> నుంచి VoNRకు అప్డేట్ అయిపోయింది. ప్రస్తుతం ఇండియాలో 5G యూజర్లకు వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అందుబాటులో ఉంది. ఇది హై-డెఫినిషన్ ఆడియో, వాయిస్ నాణ్యతతో పాటు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. రియల్ టైమ్ కమ్యూనికేషన్‌కు సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకకాలంలో వాయిస్& డేటా ట్రాన్స్‌మిషన్‌ను అనుమతిస్తుంది.

Similar News

News February 8, 2026

SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SPMCIL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్(సైబర్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com

News February 8, 2026

తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

image

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్‌లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్‌స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.

News February 8, 2026

T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

image

ముంబై: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.