News October 7, 2024
40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్‌పై బాంబులేసిన ఇజ్రాయెల్
యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.
Similar News
News December 21, 2024
కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?
చెక్కర అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల జీవితంలో కొంత కాలాన్ని కోల్పోతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోక్ లాంటి కూల్‌డ్రింక్ తాగితే 12 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని తెలిపారు. ఇది తాగిన తర్వాత ఊబకాయం, మధుమేహం వంటివి సోకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హాట్ డాగ్ తింటే 36 నిమిషాలు, శాండ్‌విచ్‌లు తింటే 13 నిమిషాలు, చీజ్‌బర్గర్‌లు తింటే జీవితంలో 9 నిమిషాలను కోల్పోతారు.
News December 21, 2024
పాప్‌కార్న్.. GST @ 5%, 12%, 18%!
సినిమా థియేటర్లు సహా ఇతర లీజర్, ఎంటర్‌టైన్మెంట్ సమయాల్లో కొనే పాప్‌కార్న్ రకాన్ని బట్టి GST మారుతుంది. మీరు ప్యాకింగ్ లేని రెడీ టు ఈట్ సాల్ట్ పాప్‌కార్న్ కొంటే 5% GST వర్తిస్తుంది. ఇక ప్యాకింగ్, బ్రాండ్ లేబ్లింగ్ ఉన్నది కొంటే 12% పన్ను చెల్లించాలి. క్యారమెల్ వంటి షుగర్ కోటెడ్ వేరియంట్ కొంటే 18% ట్యాక్స్ పడుతుంది.
News December 21, 2024
మహారాష్ట్ర నూతన మంత్రివర్గం ఖరారు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. హోం, విద్యుత్, న్యాయ శాఖ పదవులు తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక, ప్లానింగ్ శాఖను అజిత్ పవార్‌కు, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలను ఏక్‌నాథ్ శిండేకు అప్పగించారు. రెవెన్యూ-చంద్రశేఖర్ ప్రభావతి, వ్యవసాయ-మాణిక్‌రావు సరస్వతి, సివిల్ సప్లై-ధంజయ్ రుక్మిణి ముండే, పరిశ్రమలు-ఉదయ్ స్వరూప రవిచంద్ర, ఐటీ-ఆశిశ్ మీనాల్.