News October 7, 2024

40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్‌పై బాంబులేసిన ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.

Similar News

News December 12, 2025

విష్ణువు మన కోర్కెలు ఎలా తీరుస్తాడు?

image

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||
పరమాత్ముడైన విష్ణుమూర్తి దీప్తిమంతుడు. ప్రకాశవంతుడు. ఆయన సహనశీలి. సృష్టిలో మొదటగా జన్మించింది ఆయనే. పాప రహితుడు, అనఘుడు, విజయాన్ని సైతం జయించేవాడు కూడా ఆయనే. ఇంతటి గొప్ప భగవంతుడైన ఆ దశావతార మూర్తికి మన కోర్కెలు తీర్చడం అసాధ్యమే కాదు. అందుకే ఆయనను ధ్యానిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 12, 2025

చాపకింద నీరులా విస్తరిస్తోన్న సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ

image

రెండో సారి గర్భం దాల్చలేకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ. ప్రస్తుతం దీని తీవ్రత ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. యూరోపియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ 2021లో చేసిన ఒక అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 20 శాతం జంటలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మహిళల్లో వయసు పెరిగిపోవడంతో పాటు ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ బ్లాక్, ఓవేరియన్ సిస్ట్ వంటివి దీనికి కారణమని చెబుతున్నారు.

News December 12, 2025

IMF షరతులతో పాక్ ఉక్కిరిబిక్కిరి

image

పాకిస్థాన్‌‌కు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 7 బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దశలవారీగా కండిషన్స్ కూడా పెడుతోంది. తాజాగా మరో 11 షరతులు పెట్టడంతో మొత్తం నిబంధనల సంఖ్య 64కు చేరింది. వీటిని 18 నెలల్లో అమలు చేయాలి. వీటిలో మొదటిది కరప్షన్ కట్టడికై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆస్తుల వివరాలు ఈ ఏడాది చివరినాటికి ప్రకటించేలా డెడ్ లైన్ విధించింది.