News October 7, 2024
‘దేవర-2’ షూటింగ్ అప్పటి నుంచేనా?

‘దేవర-2’ సినిమా షూటింగ్ 2025, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పార్ట్-1కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పార్ట్-2కి పనిచేయకపోవచ్చని సమాచారం. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ‘దేవర’ ఇప్పటివరకు రూ.460కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పార్ట్-1లో చాలా విషయాలను డైరెక్టర్ సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో పార్ట్-2పై ఆసక్తి నెలకొంది.
Similar News
News March 18, 2026
బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
News March 18, 2026
మరో 10 రోజుల్లో సందడే సందడి!

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరో 10 రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 28న IPL సీజన్-19 అట్టహాసంగా <<19356627>>ప్రారంభం<<>> కానుంది. 10 జట్లు టైటిల్ వేటలో పోటీ పడనున్నాయి. సమ్మర్‌లో సుమారు 2 నెలల పాటు ఫ్యాన్స్‌కు వినోదం పంచనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB, SRH తలపడనున్నాయి. మరి మీ ఫేవరెట్ టీమ్ ఏది? టైటిల్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 18, 2026
ధురంధర్-2: ఇంకా థియేటర్లకు చేరని సెకండాఫ్?

భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్టాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. క్లైమాక్స్, సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసినా హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు.


