News October 7, 2024

‘దేవర-2’ షూటింగ్ అప్పటి నుంచేనా?

image

‘దేవర-2’ సినిమా షూటింగ్ 2025, అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. పార్ట్-1కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పార్ట్-2కి పనిచేయకపోవచ్చని సమాచారం. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ‘దేవర’ ఇప్పటివరకు రూ.460కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పార్ట్-1లో చాలా విషయాలను డైరెక్టర్ సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో పార్ట్-2పై ఆసక్తి నెలకొంది.

Similar News

News November 12, 2024

వైసీపీని వీడటం లేదు: పండుల

image

AP:తాను YCPని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని MLC పండుల రవీంద్రబాబు ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు. నాకు YCPని వీడాల్సిన అవసరం లేదు. జగన్‌తోనే నా ప్రయాణం. దేశంలో ఎవరూ చేయని విధంగా జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అన్ని కులాలతో సమానంగా దళితులకు పెద్ద పీట వేశారు. అలాంటి వ్యక్తిని, ఆ పార్టీ విలువలను వదిలి వెళ్లే ఆలోచన నాకు లేదు’ అని ఆయన వెల్లడించారు.

News November 12, 2024

సజ్జల భార్గవ్ రెడ్డికి లుకౌట్ నోటీసులు

image

AP: YCP సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు గుంటూరులో నమోదైన కేసులో భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

News November 12, 2024

VIRAL: ఏపుగా కాదు.. అడ్డంగా పెరుగుతాయ్!

image

పైనున్న చెట్టుకేంటి ఒకవైపే కొమ్మలున్నాయి అనుకుంటున్నారా? ఇలాంటివి న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి స్లోప్ పాయింట్ సమీపంలోని సౌత్ ఐలాండ్‌లో ఉంటాయి. దక్షిణ మహాసముద్రం నుంచి వచ్చే ఎడతెగని గాలుల వల్ల ఇలాంటి ఆకృతిలో చెట్లు పెరుగుతుంటాయి. ఈ గాలులు బలంగా, స్థిరంగా ఉండటంతో చెట్లు అడ్డంగా పెరిగినట్లు కనిపిస్తుంటుంది. కఠోరమైన పరిస్థితులనూ ప్రకృతి తనకు అనుకూలంగా మార్చుకుంటుందనడానికి ఇదొక ఉదాహరణ.