News October 8, 2024

ఒడిశాలో అన్ని ప్రభుత్వ భవనాలకు ఒకేలా

image

ఒడిశాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేలా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు నారింజ రంగు వేసి అంచుల్లో ఎరుపు రంగు వేయాలని వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలకు ఒకే కలర్ కోడ్ పాటించాలని అధికారులకు రాసిన లేఖలో పేర్కొంది.

Similar News

News February 22, 2026

బానిసత్వ మనస్తత్వం వీడాలి.. దేశ సంస్కృతిని గౌరవించుకోవాలి: మోదీ

image

బానిసత్వ మనస్తత్వం వీడి భారతీయ సంస్కృతిని గౌరవించుకోవాలని PM మోదీ పిలుపునిచ్చారు. రేపటి నుంచి MAR 1 వరకు రాష్ట్రపతి భవన్‌లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో తెలిపారు. AI సమ్మిట్ గురించి ప్రస్తావించారు. AIలో దేశ పురోగతి, యానిమల్ హెల్త్ కేర్&అగ్రికల్చర్‌లో టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఈ నెల 24న TN మాజీ సీఎం జయలలిత జయంతి నేపథ్యంలో ఆమె సేవలను గుర్తుచేశారు.

News February 22, 2026

పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

image

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.

News February 22, 2026

అప్పుడు కూలదోసింది.. ఇప్పుడు కూడానా?

image

రాజీకి రాకపోతే ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి US సిద్ధంగా ఉంది. అయితే ఇది అమెరికాకు కొత్తేం కాదు. 1953లో అప్పటి పీఎం మొస్సాదేగ్ సర్కార్‌ను పడగొట్టింది. ఇరాన్ నేతలు, మిలిటరీ మద్దతు కూడగట్టి పత్రికల్లో మొస్సాదేగ్‌కు వ్యతిరేక కథనాలు ప్రచురించి అసమ్మతిని పెంచింది. ఆయిల్ కంట్రోల్ కోసం, USSR ప్రభావం పడకూడదని బ్రిటన్‌తో కలిసి ఆపరేషన్ ఎజాక్స్ చేపట్టింది. రెజా పహ్లావి రాచరికానికి మద్దతు ఇచ్చింది.