News October 8, 2024

ఒడిశాలో అన్ని ప్రభుత్వ భవనాలకు ఒకేలా

image

ఒడిశాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేలా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు నారింజ రంగు వేసి అంచుల్లో ఎరుపు రంగు వేయాలని వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలకు ఒకే కలర్ కోడ్ పాటించాలని అధికారులకు రాసిన లేఖలో పేర్కొంది.

Similar News

News December 12, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.

News December 12, 2025

ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

image

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్‌, ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002 వంటివి ఆమె చేపట్టారు.

News December 12, 2025

తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్‌

image

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.