News October 8, 2024
ఆధిక్యంలో హాఫ్ సెంచరీ కొట్టిన కాంగ్రెస్ కూటమి

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి భారీ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం ఆ కూటమి 50 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. BJP 23 సీట్లు, PDP 2, AIP ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కశ్మీర్లో 90 అసెంబ్లీ సీట్లుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం.
Similar News
News January 17, 2026
OFFICIAL: NDA ఘన విజయం

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 227 వార్డుల్లో బీజేపీ 89 స్థానాలు, శివసేన (శిండే వర్గం) 29 సీట్లతో మొత్తంగా 118 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు శివసేన (UBT) 65, MNS 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, NCP 3, సమాజ్‌వాదీ పార్టీ 2 , NCP (SP) ఒక్క సీటు మాత్రమే గెలిచింది.
News January 17, 2026
ఇరాన్ పరిస్థితిపై కీలక ఫోన్ కాల్

ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో చర్చించారు. మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్లో నెలకొన్న అస్థిరతపై ఇరువురు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని పుతిన్ తెలిపినట్లు సమాచారం. శాంతి పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News January 17, 2026
మట్టి పాత్రకు ₹29 లక్షలు.. 91 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్ప్రైజ్

బాల్కనీలో 40ఏళ్లు పడున్న మట్టి పాత్రకు ₹29 లక్షలు వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా? పైగా బర్త్‌డే రోజు ఆ సర్ప్రైజ్ అందితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నెబ్రాస్కా(US)లోని 91ఏళ్ల లోయిస్ జుర్గెన్స్ బామ్మ విషయంలో ఇదే జరిగింది. తొలుత ఆ పాత్రను 50 డాలర్లకు అమ్మాలకున్నారు. తర్వాత Bramer Auction గురించి తెలుసుకొని వేలంలో ఉంచారు. పాత్రపై ఉన్న అరుదైన బ్లూ బటర్‌ఫ్లై మార్కింగ్స్ వల్ల ఏకంగా 300 మంది పోటీ పడ్డారు.


