News October 8, 2024

ఆధిక్యంలో హాఫ్ సెంచరీ కొట్టిన కాంగ్రెస్ కూటమి

image

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి భారీ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం ఆ కూటమి 50 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. BJP 23 సీట్లు, PDP 2, AIP ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో 90 అసెంబ్లీ సీట్లుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం.

Similar News

News December 11, 2025

గుడికి వెళ్లినప్పుడు ఇలా చేయండి..

image

గర్భగుడిలో దర్శనం చేసుకునేటప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థించాలి. హారతి సమర్పించే సమయంలో కళ్లు తెరవాలి. దీనివల్ల చీకటిలో వెలిగే కర్పూరం వెలుగు కళ్లను ఉత్తేజపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకున్నప్పుడు ఆ వెచ్చదనం చేతులకు తగులుతుంది. ఆ చేతులను తిరిగి కళ్లపై ఉంచుకున్నప్పుడు స్పర్శా శక్తి జాగృతమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఆలయ దర్శనంలో ఈ దివ్యానుభూతి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

News December 11, 2025

స్క్రబ్ టైఫస్.. డ్రగ్ రెసిస్టెన్స్‌ను పెంచుకున్న క్రిములు!

image

AP: <<18454752>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు, మరణాల విషయంలో కీలక అంశం వెల్లడైంది. దీని చికిత్సకు వాడే యాంటీబయాటిక్ ‘డాక్సీ సైక్లిన్’ ప్రభావం చూపడం లేదు. వ్యాధికారక క్రిములు ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. దీంతో రోగుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, రిపోర్టుల తర్వాత మెరుగైన డ్రగ్స్ వాడటంపై అంచనాకు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు స్క్రబ్ టైఫస్ వల్ల 11 మంది చనిపోయారు.

News December 11, 2025

చలికాలం.. పాడి పశువుల సంరక్షణ(2/2)

image

ఇప్పటి వరకు పశువులకు గాలికుంటు, గొంతువాపు, చిటుక వ్యాధుల టీకాలు వేయించకపోతే వెటర్నరీ డాక్టర్ సూచన మేరకు టీకాలు వేయించాలి. బాహ్య పరాన్న జీవుల నుంచి పశువులను, జీవాలను కాపాడటానికి పాకలను, షెడ్లను శుభ్రంగా ఉంచాలి. పశువుల విసర్జితాలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. షెడ్లలో నిమ్మ గడ్డి, తులసి, వావిలాకు కొమ్మలను కట్టలుగా కట్టి వేలాడదీస్తే వీటి నుంచి వచ్చే వాసనకు బాహ్యపరాన్న జీవులు షెడ్లలోకి రాకుండా ఉంటాయి.