News October 8, 2024
ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్‌లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్‌గా భక్తులను ఆకర్షిస్తోంది.
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.


