News October 8, 2024
ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు
భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్‌లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
Similar News
News November 8, 2024
ట్రంప్ క్యాబినెట్‌లోకి మస్క్?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్ పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఇండో-అమెరికన్లు వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్, నిక్కీ హేలీకి చోటు దక్కనున్నట్లు సమాచారం. తులసీ గబ్బార్డ్, మైక్ పాంపియో, బ్రూక్ రోలిన్స్, మార్కో రూబియో, రాబర్ట్ F.కెన్నడీ Jr, మైక్ వాల్ట్జ్, మిల్లర్‌లను ట్రంప్ తన క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
News November 8, 2024
US ఉపాధ్యక్షుడిగా JD వాన్స్ విచిత్ర రికార్డు
US అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన <<13637824>>JD వాన్స్<<>> ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ శతాబ్దంలో ఆయన గడ్డం ఉన్న తొలి ఉపాధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 1933లో మీసాలతో ఉన్న చార్లెస్ కర్టిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. చార్లెస్ ఫెయిర్ బ్యాంక్స్ గడ్డం ఉన్న చివరి వైస్‌ప్రెసిడెంట్(1905-09)గా నిలిచారు.
News November 8, 2024
గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే
పండుగ సీజన్ కావడంతో గత నెలలో భారత వాహన మార్కెట్ మంచి అమ్మకాల్ని నమోదు చేసింది. అత్యధికంగా మారుతీ ఎర్టిగా కారు 18,785 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబరుతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్(17,539), క్రెటా(17,497), బ్రెజా(16,565), మారుతీ సుజుకీ ఫ్రాంక్స్(16,419), బలేనో(16,082), టాటా పంచ్(15,470), స్కార్పియో(15,677), టాటా నెక్సాన్(14,759), గ్రాండ్ విటారా(14,083) ఉన్నాయి.