News October 8, 2024
అవినీతి జగన్‌పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్

AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News March 19, 2026
2 నౌకల్లోని LPGతో ఎన్ని సిలిండర్లు నింపొచ్చో తెలుసా?

యుద్ధం వేళ హార్ముజ్ జలసంధిని దాటుకుని భారత్‌కు వచ్చిన శివాలిక్, నందాదేవి నౌకల్లో 92,712 మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని ద్వారా 65.3 లక్షల డొమెస్టిక్ సిలిండర్లను నింపొచ్చు. భారత్‌లో సగటున రోజుకు 55.7 లక్షల సిలిండర్లను రీఫిల్ చేసుకునేందుకు బుకింగ్స్ చేసుకుంటారు. ఇండియాకు చెందిన మొత్తం 22 నౌకలు ఇప్పటికీ ఆ జలసంధిలో చిక్కుకొని ఉన్నాయి. వాటిలో క్రూడాయిల్, LPG, LNG తదితర గ్యాస్ నిల్వలు ఉన్నాయి.
News March 19, 2026
సౌదీ అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ దాడి

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్‌కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
News March 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


