News October 8, 2024
అవినీతి జగన్‌పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్
AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 11, 2024
గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమ్ ఇండియా
టీమ్ ఇండియాతో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 125 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత తడబడ్డ సౌతాఫ్రికా చివర్లో అదరగొట్టింది. స్టబ్స్(41 బంతుల్లో 47*), కోయెట్జీ(9 బంతుల్లో 19*) మరో ఓవర్ మిగిలి ఉండగానే తమ జట్టుకు విక్టరీని అందించారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో సత్తా చాటినా ప్రయోజనం లేకపోయింది.
News November 11, 2024
ఐదు వికెట్లు తీసిన వరుణ్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. టీ20Iల్లో 5 వికెట్లు తీయడం ఆయనకిదే తొలిసారి. మొత్తంగా 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీయడం గమనార్హం.
News November 11, 2024
భారీ భూకంపం.. వణికిన క్యూబా
క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. బార్టోలోమోకు 40 కి.మీ దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఆ సమీపంలోని మంజనిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు.