News October 8, 2024

16 వేల సమావేశాలు నిర్వహించిన RSS.. హరియాణా ఎన్నికల్లో కీ రోల్

image

హరియాణా ఎన్నికల్లో BJP అనూహ్యంగా పుంజుకోవడం వెనుక RSS కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 4 నెలల్లో క్షేత్ర‌స్థాయిలో 16 వేల‌కుపైగా స‌మావేశాలు నిర్వ‌హించింది. సంఘ్ కార్య‌క‌ర్త‌లు ఇంటింటి ప్ర‌చారం ద్వారా జాట్‌యేత‌ర ఓట్ల‌ను BJPకి చేరువ చేసినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పైగా అభ్య‌ర్థుల ఎంపిక‌లో BJP-RSS ఈసారి క‌లిసి ప‌నిచేశాయి. హిందూ స‌మాజం సంఘటితంపై మోహ‌న్ భాగ‌వ‌త్ పిలుపు ఫలితాన్నిచ్చింది.

Similar News

News December 25, 2025

‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన మోదీ.. ఏంటిది?

image

లక్నోలో(UP) ₹230 కోట్లతో, 65 ఎకరాల్లో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి గొప్ప ఆలోచనలు, సుపరిపాలన పాఠాలను ముందు తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రధాని వివరించారు. దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.

News December 25, 2025

‘అతను అంతమైపోవాలి’.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

image

రష్యాతో యుద్ధంపై విసిగిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్రిస్మస్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అందరిదీ ఒకే కోరిక.. అతను అంతమైపోవాలి’ అంటూ పరోక్షంగా పుతిన్ మరణాన్ని కోరుకున్నారు. రష్యా వెనక్కి తగ్గితే తూర్పు ఉక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని జెలెన్‌స్కీ అన్నారు. ఆ ప్రాంతం అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఏదైనా పీస్ డీల్ వస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటానన్నారు.