News October 8, 2024

16 వేల సమావేశాలు నిర్వహించిన RSS.. హరియాణా ఎన్నికల్లో కీ రోల్

image

హరియాణా ఎన్నికల్లో BJP అనూహ్యంగా పుంజుకోవడం వెనుక RSS కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత 4 నెలల్లో క్షేత్ర‌స్థాయిలో 16 వేల‌కుపైగా స‌మావేశాలు నిర్వ‌హించింది. సంఘ్ కార్య‌క‌ర్త‌లు ఇంటింటి ప్ర‌చారం ద్వారా జాట్‌యేత‌ర ఓట్ల‌ను BJPకి చేరువ చేసినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పైగా అభ్య‌ర్థుల ఎంపిక‌లో BJP-RSS ఈసారి క‌లిసి ప‌నిచేశాయి. హిందూ స‌మాజం సంఘటితంపై మోహ‌న్ భాగ‌వ‌త్ పిలుపు ఫలితాన్నిచ్చింది.

Similar News

News December 11, 2025

ఇంకెన్నాళ్లు.. అప్డేట్ అవ్వండి!

image

ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో దరఖాస్తు పత్రాలు(200KB), ఫొటోలు (100KB), సిగ్నేచర్ (50KB) వంటి అప్‌లోడ్‌‌కు సైజు పరిమితులు ఉండటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెట్ వేగం తక్కువగా ఉండేదని.. నేటి హైస్పీడ్ నెట్ యుగంలో నాణ్యత తగ్గించడానికి ఇతర యాప్స్ వాడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఫైల్ అప్‌లోడ్ చేశాక సర్వరే దాని పరిమాణాన్ని తగ్గించుకునేలా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై మీకామెంట్?

News December 11, 2025

మేడిగడ్డ భద్రత, రిపేర్లపై NDSA సమీక్ష

image

TG: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ హైదరాబాద్‌లో ఉన్నత నీటిపారుదల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆనకట్టల భద్రతకు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తున్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం అథారిటీ చేసిన సిఫార్సుల అమలుపై కూడా ఆయన సమావేశంలో చర్చిస్తున్నారు. కాగా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రభుత్వం ఇప్పటికే అథారిటీకి నివేదిక అందించింది.

News December 11, 2025

నిద్రలో పేరెంట్స్ నిర్లక్ష్యం.. పసికందు కన్నుమూత

image

తల్లిదండ్రులు నిద్రలో ఒరగడంతో 26 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన UPలో జరిగింది. తమ బిడ్డ సూఫియాన్‌ను తల్లిదండ్రులు మంచంపై మధ్యలో పెట్టుకుని పడుకున్నారు. నిద్రమత్తులో ఇద్దరు బేబీవైపు తిరగడంతో శిశువు మధ్యలో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయాడు. ఉదయం పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నించగా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. పేరెంట్స్.. జాగ్రత్త.
Share It