News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఆప్ బోణీ

image

జమ్మూ కశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. జమ్మూ రీజియన్‌లోని దొడ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో మాలిక్‌కు 22,944 ఓట్లు రాగా, రాణాకు 18,174 ఓట్లు వచ్చాయి. కాగా మాలిక్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

Similar News

News January 30, 2026

భూమి బయట సముద్రం ఉంటుందా?

image

భూమ్మీద సముద్రాలుంటాయి. మరి హిరణ్యాక్షుడు భూమిని సంద్రంలో ఎలా దాచాడు? ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం.. ఈ విశ్వంలో సగం వరకు ‘గర్భోదక జలాలు’ ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. హిరణ్యాక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగునే పడేశాడు. ఓ నీటి గిన్నెలో బంతి మునిగినట్లుగా, భూగోళం ఆ సంద్రంలో మునిగింది. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి, భూమిని రక్షించాడు.

News January 30, 2026

భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

image

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.

News January 30, 2026

మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

image

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.