News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఆప్ బోణీ

image

జమ్మూ కశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. జమ్మూ రీజియన్‌లోని దొడ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో మాలిక్‌కు 22,944 ఓట్లు రాగా, రాణాకు 18,174 ఓట్లు వచ్చాయి. కాగా మాలిక్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

Similar News

News November 5, 2024

జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత

image

AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్‌ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.

News November 5, 2024

ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద‌’న్న అవుతారు!

image

అమెరికా ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం సాధిస్తే అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అధిక వ‌య‌స్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బైడెన్ వ‌య‌సు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి వ‌య‌సుతో పోల్చితే ట్రంప్ వ‌య‌సు ఐదు నెల‌లు అధికం. ఈ లెక్క‌న ట్రంప్ గెలిస్తే అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేసే పెద్ద‌ వ‌య‌స్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చ‌రిత్ర సృష్టిస్తారు.

News November 5, 2024

తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్

image

TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.