News October 8, 2024

నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు: నాగార్జున లాయర్

image

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం తీసుకుంటారని చెప్పారు. నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు తీసుకుంటుందని, ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News January 29, 2026

KMR: నామిషన్లలో అభ్యర్థులు ఫుల్ బిజీ.. ప్రచారానికి బ్రేక్..!

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు విషయంలో బిజీగా ఉండటంతో ప్రచార పర్వానికి బ్రేక్ పడింది. మున్సిపల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల, ప్రతిపాదిత వ్యక్తుల నో డ్యూ సర్టిఫికెట్ల కోసం బారులు తీరడంతో సమయానికి సంబంధిత పత్రాలు పొందడానికి అక్కడే సమయం పట్టడంతో ప్రచారానికి బ్రేక్ వేశారు. రేపటిలోగా నామినేషన్లు దాఖలు చేసి వార్డుల్లో ప్రచారం చేయనున్నారు.

News January 29, 2026

KCR ఫామ్ హౌస్‌కు బయల్దేరిన సిట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18991166>>నోటీసులు<<>> ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయనకు నోటీసులు అందించే అవకాశముంది. ఆపై సిట్ నోటీసులపై ప్రకటన చేయనుంది. మరోవైపు రేపు సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.

News January 29, 2026

ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.