News October 8, 2024
నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు: నాగార్జున లాయర్

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం తీసుకుంటారని చెప్పారు. నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు తీసుకుంటుందని, ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News January 23, 2026
ఖలిస్థానీల దుశ్చర్య.. త్రివర్ణ పతాకం తొలగింపు

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంలోకి ఖలిస్థానీ మూకలు చొరబడ్డాయి. జాగ్రెబ్‌లోని ఎంబసీపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఆ స్థానంలో ఖలిస్థానీ జెండాను ఎగురవేశాయి. ఈ దుశ్చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.
News January 23, 2026
పాపం ఆ చిన్నారి.. బిక్కుబిక్కుమంటూ చూస్తూ..

అమెరికాలోని మిన్నెసోటాలో అక్రమ వలసలపై ICE అధికారులు <<18880489>>ఉక్కుపాదం<<>> మోపుతున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి లియామ్ రామోస్‌ను డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీంతో చిన్నారి ఏడుస్తూ, బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయాడు. ప్రీస్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అధికారులు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రామోస్ చిన్న పిల్లాడని, ఆ పసికందును ఎరలా వాడుకోవద్దని మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మండిపడ్డారు.
News January 23, 2026
350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


