News October 8, 2024
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్: సత్యకుమార్
AP: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసేందుకే రూ.88 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్లు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
Similar News
News December 22, 2024
వన్డే సిరీస్పై కన్నేసిన భారత్
విండీస్పై టీ20 సిరీస్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్పై కన్నేసింది. నేడు కరేబియన్ జట్టుతో తొలి వన్డేలో తలపడనుంది. బ్యాటింగ్లో హర్మన్ప్రీత్, స్మృతి, జెమీమా, రిచా, బౌలింగులో దీప్తి, రేణుక, సైమా నిలకడగా రాణిస్తుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశాలు. మరోవైపు వన్డేల్లోనైనా గెలవాలని విండీస్ పట్టుదలతో ఉంది. మ.1.30 నుంచి స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News December 22, 2024
ఆ చిన్నారుల సమస్యకు శాశ్వత పరిష్కారం: లోకేశ్
AP: YSR(D) కొర్రపాడులో స్కూల్ దుస్థితిపై WAY2NEWS రాసిన <<14938798>>కథనానికి<<>> మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ప్రస్తుతం రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించాను. పునాదుల్లో నిలిచిపోయిన స్కూలు భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం’ అని ట్వీట్ చేశారు.
News December 22, 2024
నేను తలుచుకుంటే ఎవడూ మిగలడు: అచ్చెన్నాయుడు
AP: వైసీపీ హయాంలో తనను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అయితే తానేమీ కక్ష సాధింపులకు దిగడం లేదని, తన కోపం నరం తెగిపోయిందని చెప్పారు. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను తలుచుకుంటే ఒక్కడూ మిగలడని వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో జగన్ అన్ని వర్గాలనూ మోసం చేశారని విమర్శించారు. ఏకంగా రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.