News October 8, 2024
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్: సత్యకుమార్
AP: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసేందుకే రూ.88 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
Similar News
News November 11, 2024
BJP వీడియోలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు
BJP ప్రకటనలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. JMM, INC, RJD నేతలను నెగటివ్‌గా చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని పేర్కొంది. BJP4Jharkhand సోషల్ మీడియా అకౌంట్లలో వీటిని పోస్ట్ చేశారని తెలిపింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే అని వెల్లడించింది. ఝార్ఖండ్‌లో ఆదివాసీలకు తాము వ్యతిరేకమని, BJP వాళ్లు అనుకూలమన్నట్టుగా బ్రాండింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఫిర్యాదు వివరాలను జైరామ్ రమేశ్ Xలో షేర్ చేశారు.
News November 11, 2024
18 నుంచి ‘అగ్రి’ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్
TG: అగ్రికల్చర్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 నుంచి మూడో దశ కౌన్సెలింగ్ జరగనుంది. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పెషల్ కోటా, రెగ్యులర్ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుందని, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు.
News November 11, 2024
16లో 10.. మజ్లిస్ ‘మహా’ టార్గెట్!
మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.