News October 8, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరా: CM

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Similar News
News January 12, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయి 83,135 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు నష్టపోయి 25,555 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, రిలయన్స్, బెల్, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News January 12, 2026
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి యాగశాల ప్రవేశం వైభవంగా సాగింది. రాత్రి 7గం.కు నిర్వహించే ప్రధాన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. రేపట్నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న సంక్రాంతి వేళ బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది. 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిచిపోనున్నాయి.
News January 12, 2026
రైల్వేలో 312పోస్టులు.. అప్లై చేశారా?

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు JAN 31వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


