News October 8, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరా: CM
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2024
TGPSC ఛైర్మన్ నియామకానికి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20న సా.5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, TGPSC నియమావళి-2014 ప్రకారం అభ్యర్థులు అర్హతలు కలిగి ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనుంది.
News November 11, 2024
ALERT: 3 రోజులు భారీ వర్షాలు
AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDM తెలిపింది. రేపు ఈ <<14585013>>జిల్లాల్లో<<>> వర్షాలు కురవనుండగా ఎల్లుండి అల్లూరి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూల్, నంద్యాలలో వానలు పడతాయని పేర్కొంది. 14న కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.
News November 11, 2024
ఏపీలో బీసీ కులాలపై ప్రభుత్వం ప్రకటన
AP: రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలు ఉన్నాయని, వీటిని 5 గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. BC-Aలో 51, BC-Bలో 27 కులాలు, BC-Cలో ఒక కులం, BC-Dలో 45, BC-Eలో 14 కులాలు ఉన్నట్లు తెలిపింది. క్రిస్టియన్లుగా మతం మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు BC-Cలోకి వస్తారని, ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని BC-Eలుగా గుర్తించినట్లు పేర్కొంది.