News October 11, 2024

ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.

Similar News

News October 12, 2024

కురచ దుస్తులతో దుర్గమ్మ మండపానికి.. భక్తుల ఫైర్

image

కోల్‌కతాకు చెందిన ముగ్గురు మోడల్స్ కురచ దుస్తులతో దుర్గామాతను దర్శించుకున్నారు. దీనిపై భక్తులు వారిని తిట్టి పోస్తున్నారు. మాజీ మిస్ కోల్‌కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడళ్లతో కలిసి అసభ్యకర దుస్తుల్లో దుర్గామాతను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన భక్తులు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని తిడుతున్నారు.

News October 12, 2024

రేపటి మ్యాచ్‌లో ఈ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్‌?

image

హైద‌రాబాద్ వేదిక‌గా శ‌నివారం బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న చివ‌రి టీ20 మ్యాచ్‌లో ముగ్గురు భార‌త‌ ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ ఇచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. గ‌త రెండు మ్యాచ్‌ల‌లో చెప్పుకోద‌గ్గ బ్యాటింగ్ చేయ‌ని సంజూ శాంసన్ స్థానంలో తిల‌క్ వ‌ర్మ జ‌ట్టులోకి రావ‌చ్చ‌ని తెలుస్తోంది. అలాగే, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో ర‌వి బిష్ణోయ్‌, మయాంక్ యాద‌వ్ స్థానంలో హ‌ర్షిత్ రాణాకు చోటు ద‌క్కే సూచనలు కనిపిస్తున్నాయి.

News October 12, 2024

స్కిల్ వర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం

image

TG: స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ(YISU) వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 29వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. NOV 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో తరగతులు నిర్వహిస్తారు.