News October 11, 2024

ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.

Similar News

News November 11, 2024

18 నుంచి ‘అగ్రి’ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్

image

TG: అగ్రికల్చర్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 నుంచి మూడో దశ కౌన్సెలింగ్ జరగనుంది. రెండు దశల కౌన్సెలింగ్‌ తర్వాత స్పెషల్‌ కోటా, రెగ్యులర్‌ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుందని, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు.

News November 11, 2024

16లో 10.. మజ్లిస్ ‘మహా’ టార్గెట్!

image

మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.

News November 11, 2024

బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సూర్య

image

సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయని, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.