News October 11, 2024

నోయల్ టాటా చరిత్ర ఘనం

image

1957లో జ‌న్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ ద‌శ‌కంలో టాటా గ్రూప్‌లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్‌ను సంస్థ MDగా 700 స్టోర్ల‌కు విస్త‌రించారు. $500M విలువగల టాటా ఇంట‌ర్నేష‌న‌ల్‌ను $3 బిలియ‌న్లకు తీసుకెళ్లారు. టాటా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఆయ‌న ర‌త‌న్ టాటా ట్ర‌స్ట్‌, దొరాబ్జీ ట్ర‌స్టుల విధుల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు.

Similar News

News July 10, 2025

PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

image

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

News July 10, 2025

విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

image

AP: లిక్కర్‌ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.

News July 10, 2025

కష్టపడుతున్న భారత బౌలర్లు

image

భారత్‌తో మూడో టెస్టులో ఫస్ట్ సెషన్‌లో కాస్త తడబడ్డ ఇంగ్లండ్ రెండో సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది. టీ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్లకు 153 రన్స్ చేసింది. రూట్ 54*, పోప్ 44* రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకున్నారు. 44 రన్స్‌కే ఇద్దరు ఇంగ్లిష్ బ్యాటర్ల వికెట్లు తీసిన నితీశ్ భారత్‌కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే మిగతా బౌలర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్ ప్రభావం చూపలేకపోయారు.