News October 11, 2024
నోయల్ టాటా చరిత్ర ఘనం

1957లో జన్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ దశకంలో టాటా గ్రూప్‌లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్‌ను సంస్థ MDగా 700 స్టోర్లకు విస్తరించారు. $500M విలువగల టాటా ఇంటర్నేషనల్‌ను $3 బిలియన్లకు తీసుకెళ్లారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఆయన రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ ట్రస్టుల విధులను పర్యవేక్షిస్తారు.
Similar News
News July 8, 2025
తెరుచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు.. 25 ఏళ్లలో రికార్డు

AP: CM చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్రస్ట్‌గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా ప్రస్తుతం 193.4 TMCల నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 312.05 TMCలు కాగా.. 164.1 టీఎంసీలున్నాయి. సాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
News July 8, 2025
రేపు కార్మిక సంఘాల భారత్ బంద్

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందినవారు బంద్‌లో పాల్గొననున్నారు. రైతులతో కలిపి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత తెలిపారు. 10ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు.
News July 8, 2025
గోదావరికి వరద ఉద్ధృతి

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.