News October 12, 2024
పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Similar News
News July 10, 2025
శుభ సమయం (10-07-2025) గురువారం

✒ తిథి: శుక్ల పూర్ణిమ రా.1.02 వరకు తదుపరి పాడ్యమి
✒ నక్షత్రం: పూర్వాషాడ పూర్తిగా ✒ శుభ సమయం: ఉ.11.25-మ.12 వరకు తిరిగి సా.6.25- రా.7.13 వరకు ✒ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు ✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 వరకు పునః మ.2.48- 3.36 వరకు ✒ వర్జ్యం: మ.3.20-సా.5.01 వరకు ✒ అమృత ఘడియలు: రా.1.08-2.48 వరకు
News July 10, 2025
TODAY HEADLINES

☛ KCRను 100 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదు: TG CM రేవంత్
☛ నన్ను పబ్బులు, క్లబ్బులకు పిలవొద్దు: రేవంత్
☛ మంత్రులకు AP సీఎం చంద్రబాబు వార్నింగ్
☛ సింహాచలంలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు
☛ బాబు గాడిదలు కాస్తున్నారా?: YS జగన్
☛ 27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ
☛ గుజరాత్‌లో బ్రిడ్జి కూలి 13 మంది మృతి
☛ భారత్‌తో మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
News July 10, 2025
400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.