News October 12, 2024

పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

image

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Similar News

News November 4, 2024

SUPER: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘చరిత్ర’ తెలుస్తుంది!

image

చారిత్రక కట్టడాల వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర పురావస్తుశాఖ ఆయా నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. వరంగల్(D) ఖిలా వరంగల్‌లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, పురాతన కట్టడాల గురించి చూపిస్తుంది. జిల్లాల పర్యాటక ప్రాంతాల వివరాలు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వంటివి తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.

News November 4, 2024

Be Ready: నవంబర్‌లో 4 అద్భుతాలు

image

ఈనెలలో 4 అద్భుతాలు స్పేస్ లవర్స్‌కు కనువిందు చేయనున్నాయి. అందులో ఒకటి.. భూమి నుంచి నేరుగా చూడగల నక్షత్రాల్లో ఒకటైన స్పైకా ఈ నెల 27న గంటపాటు మాయం కానుంది. ఆరోజు చందమామ ఈ తెలుపు, నీలి కాంతుల తారకు తెరగా అడ్డు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తూర్పు అమెరికా, కెనడాలో ఈ వండర్ వీక్షించవచ్చు. ఇక మరో 3.. అంగారక, గురు, శని గ్రహాలు ఈ మాసంలో భూమికి చేరువగా రానుండగా, రాత్రుళ్లు వీటిని నేరుగానే చూడవచ్చట.

News November 4, 2024

వారెన్ బఫెట్ ‘రెడ్ సిగ్నల్’ ఇస్తున్నారా?

image

స్టాక్ మార్కెట్ లెజెండ్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే నగదు నిల్వలను మరింత పెంచుకుంది. చివరి త్రైమాసికంలో $276.9 బిలియన్లుగా ఉన్న క్యాష్ ఇప్పుడు $325.2 బిలియన్లకు పెరిగింది. ఆ కంపెనీ $300 బిలియన్లకు పైగా నగదు ఉంచుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో అమెరికా ఎన్నికల తర్వాత గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, అందుకే బఫెట్ షేర్లు అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.