News October 13, 2024

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.

Similar News

News February 3, 2026

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News February 3, 2026

శుభ సమయం (03-2-2026) మంగళవారం

image

➤ తిథి: బహుళ విదియ రా.02.06 వరకు తదుపరి తదియ ➤ నక్షత్రం: ముఖ రా.11.47 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.25-8.47 వరకు, ఉ.9.34-ఉ.11.15 వరకు తిరిగి మ.3.00 నుంచి సా.5.49 వరకు ➤ రాహుకాలం: ప.03.00- 4.30 వరకు ➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.48-ఉ.9.33 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.45 వరకు ➤ వర్జ్యం: ఉ.11.55-మ.1.30 వరకు ➤ అమృత ఘడియలు: రా.9.25 నుంచి రా.11.00 వరకు

News February 3, 2026

ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు ట్రంప్ నాయకత్వం కీలకం: మోదీ

image

ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ట్రంప్ నాయకత్వం కీలకమని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం అద్భుత నిర్ణయం. భారత్, అమెరికా సహకారం రెండు దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నా. ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు.