News October 14, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Similar News

News October 14, 2024

రెజ్యూమ్ కూడా పెట్టని యువతికి జాబ్.. CEO ఏం చెప్పారంటే!

image

ప్రస్తుత రోజుల్లో జాబ్ కొట్టడమనేది యువతకు కత్తి మీద సామే. అయితే డిఫరెంట్ అప్రోచ్, స్కిల్స్ ఉంటే కొలువు ఈజీగానే పొందవచ్చనడానికి ఈ ఘటనే నిదర్శనం. పని అనుభవం లేని, రెజ్యూమ్ కూడా పెట్టని లైబా అనే యువతికి ఓ ఏజెన్సీ CEO తస్లీమ్ జాబ్ ఇచ్చారు. తన స్కిల్స్ వివరిస్తూ లైబా క్రియేట్ చేసిన వీడియో ఆకట్టుకుందని తస్లీమ్ తెలిపారు. 800 మందిని కాదని ఆమెను సెలక్ట్ చేయగా, మంచి పనితీరుతో రాణిస్తున్నారని చెప్పారు.

News October 14, 2024

ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారు: రకుల్

image

తాను ప్రభాస్‌తో ఓ సినిమాలో నటించానని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడంతో బాధేసిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ మూవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ చిత్రీకరించారు. తర్వాత ఫోన్ చేయలేదు. తర్వాత నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తెలిసింది. హిట్ జోడీ కాబట్టి మేకర్స్ కాజల్‌ను తీసుకున్నారట’ అని చెప్పుకొచ్చారు.

News October 14, 2024

భారీగా పతనమైన D-Mart షేరు ధర

image

Jul-Sep క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్వెస్ట‌ర్ల‌ను మెప్పించ‌క‌పోవ‌డంతో డీమార్ట్ షేరు ధ‌ర 8% పతనమై రూ.4186 వద్ద కదులుతోంది. గ‌త ఫ‌లితాల కంటే 5% అధిక లాభంతో ₹659 కోట్ల నిక‌ర లాభాన్ని ఆర్జించినా మెప్పించలేకపోయింది. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. బడా ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. క్విక్ కామర్స్ పోటీ కూడా డీమార్ట్ షేర్లు పడిపోవడానికి ఓ కారణమని చెబుతున్నారు.