News October 14, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
Similar News
News November 12, 2024
బర్త్ డేకు రావాలని ఆహ్వానం.. లోకేశ్ ఏమన్నారంటే?
AP: తమ కూతురి పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు, క్షణం తీరికలేని శాఖా వ్యవహారాలు ఉండటంతో వేడుకకు రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. కోనసీమ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని కలిసి, పాపకు ఆశీస్సులు అందజేస్తానని రిప్లై ఇచ్చారు.
News November 12, 2024
రాష్ట్రపతి, గవర్నర్‌కు YCP ఫిర్యాదు
AP: తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు 100కు పైగా కేసులు నమోదు చేశారని YCP రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వాక్‌స్వేచ్ఛను అణచివేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. కస్టడీలో కార్యకర్తలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని తెలిపింది. కల్పిత కేసులు పెడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
News November 12, 2024
నవంబర్ 12: చరిత్రలో ఈ రోజు
* 1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం.
* 1866: చైనా మొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం.
* 1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం.
* 1896: విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం.(ఫొటోలో)
* 1925: ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం.
* 1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం.