News October 14, 2024
కోహ్లీ ప్రపంచస్థాయి క్రికెటర్: గంభీర్

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘2008లో కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్‌లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్‌ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్‌ల్లోనూ కోహ్లీ రాణిస్తారు’ అని తెలిపారు.
Similar News
News July 6, 2025
విజయానికి 5 వికెట్లు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.
News July 6, 2025
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.