News October 14, 2024
కోహ్లీ ప్రపంచస్థాయి క్రికెటర్: గంభీర్
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘2008లో కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడిపై నా అభిప్రాయం మారలేదు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్. శ్రీలంకపై తొలిమ్యాచ్‌లోనే ఆయనతో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం నాకింకా గుర్తుంది. ఎప్పుడూ పరుగుల ఆకలితో ఉండటం ఆయన్ను దిగ్గజ క్రికెటర్‌ను చేసింది. NZ, AUS టెస్టు సిరీస్‌ల్లోనూ కోహ్లీ రాణిస్తారు’ అని తెలిపారు.
Similar News
News November 3, 2024
గజినీలా ప్రవర్తిస్తోన్న చంద్రబాబు: వాలంటీర్లు
AP: తమకు ఇచ్చిన హామీలను మరచిపోయి సీఎం చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. తమ గౌరవ వేతనం రూ.10 వేలను ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు, పవన్‌ను వారు ప్రశ్నించారు. తాము మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 3, 2024
ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
AP: ఈ నెలాఖరుతో ఓటాన్ బడ్జెట్ ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజున ఉ.10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో(నవంబర్-మార్చి) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగే అవకాశముంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనుంది.
News November 3, 2024
INDvsNZ: బ్యాటర్లపైనే భారం
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఫలితం నేడు తేలే ఛాన్సుంది. ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయిన కివీస్ 143 రన్స్ లీడ్‌లో ఉంది. ఆ జట్టుకు 150 రన్స్‌కి మించి లీడ్ ఇవ్వొద్దని భారత్ భావిస్తోంది. టార్గెట్ 150 రన్స్‌లోపు ఉంటే రోహిత్‌సేన కంఫర్టబుల్‌గా ఛేజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక మన బ్యాటర్లపైనే భారం ఉంది.