News October 16, 2024
HYD: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

DR.BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30తేదీలోపు చెల్లించొచ్చని తెలిపారు. braouonline వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.
Similar News
News January 15, 2026
BREAKING: టెర్రస్ వార్.. HYDలో చిందిన రక్తం

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
News January 15, 2026
HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.
News January 15, 2026
HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయట.


