News October 18, 2024

GOVT ఆస్పత్రులకు పోలీస్ భద్రత

image

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులను అరికట్టడానికి వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. GOVT ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్యవేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్ పాస్ అందించనుంది. వైద్యుల రక్షణకు కమిటీలు ఏర్పాటుచేయనుంది.

Similar News

News October 18, 2024

9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

image

TG: * కాకతీయ వర్సిటీ – ప్రతాప్ రెడ్డి
* ఉస్మానియా – ఎం.కుమార్
* పాలమూరు – శ్రీనివాస్
* శాతవాహన – ఉమేశ్ కుమార్
* తెలుగు వర్సిటీ – నిత్యానంద రావు
* మహాత్మాగాంధీ వర్సిటీ – అల్తాఫ్ హుస్సేన్
* తెలంగాణ వర్సిటీ – యాదగిరి రావు
* వ్యవసాయ వర్సిటీ – అల్దాస్ జానయ్య
* ఉద్యానవన వర్సిటీ – రాజిరెడ్డి

News October 18, 2024

బినామీ పదానికి అర్థమేంటి? ఈ చట్టమేంటి?

image

బినామీ హిందీపదం. పేరు లేదని దీనర్థం. ఏదైనా ఆస్తి ఓనర్ కాకుండా ఇతరుల పేరుతో ఉంటే దానిని బినామీ ప్రాపర్టీ అంటారు. 1988లో బినామీ లావాదేవీల నిషేధ చట్టం కేవలం 8 సెక్షన్లతో అమల్లోకి వచ్చింది. 2016లో మోదీ ప్రభుత్వం దానిని 72 సెక్షన్లకు పెంచుతూ సవరించింది. అనేక ఆస్తులు, మోసాలు, లావాదేవీలను వర్గీకరించింది. స్థిర, చర, టచ్ చేయలేని, కనిపించని ఆస్తులూ ఇందులో చేర్చింది. కొన్నిటికి కఠిన శిక్షలు నిర్దేశించింది.

News October 18, 2024

సెహ్వాగ్ రికార్డును అధిగమించిన సౌథీ

image

టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్(91) సిక్సర్ల రికార్డును న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌథీ అధిగమించారు. భారత్‌తో జరుగుతున్న టెస్టులో నాలుగు సిక్సర్లు బాదిన సౌథీ(93) ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్ల రికార్డు బెన్ స్టోక్స్(131) పేరిట ఉంది. ఈ జాబితాలో సౌథీ(93) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నారు. భారత జట్టు నుంచి సెహ్వాగ్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్(87) ఉన్నారు.