News October 18, 2024
GOVT ఆస్పత్రులకు పోలీస్ భద్రత
TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులను అరికట్టడానికి వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. GOVT ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్యవేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్ పాస్ అందించనుంది. వైద్యుల రక్షణకు కమిటీలు ఏర్పాటుచేయనుంది.
Similar News
News November 11, 2024
ఐదు వికెట్లు తీసిన వరుణ్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. టీ20Iల్లో 5 వికెట్లు తీయడం ఆయనకిదే తొలిసారి. మొత్తంగా 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీయడం గమనార్హం.
News November 11, 2024
భారీ భూకంపం.. వణికిన క్యూబా
క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. బార్టోలోమోకు 40 కి.మీ దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఆ సమీపంలోని మంజనిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు.
News November 11, 2024
రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యంగా పడుకుంటే మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతారు. డయాబెటిస్ బారిన పడతారు. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి తరచూ జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. మహిళలకు హార్మోన్ల బ్యాలెన్స్ తప్పి పీరియడ్స్ సరిగ్గా రావని వైద్యులు హెచ్చరిస్తున్నారు.