News October 18, 2024
LOVE BOMBING.. ఇదో రోగం!

రిలేషన్‌షిప్‌పై నియంత్రణకు కొందరు చేసే భావోద్వేగ మోసాల్నే లవ్ బాంబింగ్ అంటారు. నిజానికిదో మానసిక వ్యాధి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రొమాంటిక్ పార్ట్‌నర్స్‌లో ఎవరికైనా ఇది ఉండొచ్చు. ఊరికే గిఫ్టులివ్వడం, వారిపై ఎక్కువ ఆధారపడేలా చేయడం, నిత్యం అటెన్షన్ చూపడం, అతిగా పొగడటం, పిచ్చిగా ప్రేమ చూపడం దీని లక్షణాలు. వీటితో ఒంటరై, అవతలి వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే మీరూ లవ్ బాంబింగ్ బాధితులే అన్నమాట!
Similar News
News February 1, 2026
కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుందంటే.. 1/2

కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతి రూపాయిలో 39 పైసలు ప్రత్యక్ష పన్నుల(వ్యక్తులు-22 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్-17 పైసలు) రూపంలో వస్తాయి. జీఎస్టీ-18 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ-5 పైసలు, కస్టమ్స్ డ్యూటీ-4 పైసలు, రుణాలు, ఇతర అప్పుల ద్వారా-24 పైసలు, పన్నేతర ఆదాయం-9 పైసలు, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా-1 పైసా వస్తుంది.
News February 1, 2026
ప్రతి రూపాయి ఖర్చు ఇలా.. 2/2

కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ షేర్ రాష్ట్రాలకు అందుతుంది. ట్యాక్స్, డ్యూటీస్ వాటా కింద ప్రతి రూపాయిలో 22 పైసలు వెళ్తుంది. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు వెళ్తాయి. డిఫెన్స్ సెక్టార్‌కు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్‌కు 8 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చు చేస్తారు. 8 పైసలను పాలన, ప్రభుత్వ వ్యయాల వంటి వాటికి ఉపయోగిస్తారు.
News February 1, 2026
బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కాసేపట్లో ప్రసంగం

కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. 2026-27 వార్షిక పద్దుకు ఆమోదం తెలిపింది. ముందుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌కు అనుమతి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్లమెంటుకు చేరుకొని ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొన్నారు. 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.


