News October 18, 2024
LOVE BOMBING.. ఇదో రోగం!
రిలేషన్‌షిప్‌పై నియంత్రణకు కొందరు చేసే భావోద్వేగ మోసాల్నే లవ్ బాంబింగ్ అంటారు. నిజానికిదో మానసిక వ్యాధి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రొమాంటిక్ పార్ట్‌నర్స్‌లో ఎవరికైనా ఇది ఉండొచ్చు. ఊరికే గిఫ్టులివ్వడం, వారిపై ఎక్కువ ఆధారపడేలా చేయడం, నిత్యం అటెన్షన్ చూపడం, అతిగా పొగడటం, పిచ్చిగా ప్రేమ చూపడం దీని లక్షణాలు. వీటితో ఒంటరై, అవతలి వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే మీరూ లవ్ బాంబింగ్ బాధితులే అన్నమాట!
Similar News
News November 4, 2024
HDFC బ్యాంక్ ఖాతాదారులకు గమనిక
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.
News November 4, 2024
వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!
మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.
News November 4, 2024
పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.