News October 19, 2024

మెక్సికన్ ఇన్వెస్టర్లకు సీతారామన్ ఆహ్వానం

image

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మెక్సికన్ ఇన్వెస్టర్లను FM నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. GIFT-IFSCలో ఫారిన్ యూనివర్సిటీల సెటప్, GICCs, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్‌లో అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఆర్థిక సంబంధాలు, ఫార్మా సూటికల్స్, మెడ్ టెక్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో గ్రోత్‌ను 2 దేశాల ప్రైవేటు సెక్టార్ లీడర్లు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కొన్ని కంపెనీలతో MoUలు కుదిరాయన్నారు.

Similar News

News October 19, 2024

శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. అంతలోనే!

image

చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా ఒక్కసారిగా అతను లేచాడు. గతంలో USAలో జరిగిన ఈ ఘటన తాజాగా వైరలవుతోంది. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. అవయవాలను చెక్ చేసేందుకు పరీక్ష చేయగా అతనిలో కదలిక, కళ్లలోంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేయగా గుండె తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి కూర్చున్నాడు.

News October 19, 2024

నా దేవుడు కోహ్లీ ఆశీర్వాదం కోసం వచ్చా: అభిమాని

image

బెంగళూరులో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్‌ తొలి టెస్టును చూసేందుకు భారీగా విరాట్ కోహ్లీ అభిమానులు తరలివచ్చారు. తన దేవుడు కోహ్లీ కోసం వచ్చానంటూ ఓ అభిమాని ప్లకార్డుతో కనిపించారు. ‘ఈరోజు నా బర్త్ డే కాబట్టి నా దేవుడు విరాట్ కోహ్లీ ఆశీస్సులు తీసుకునేందుకు ఈ గుడికి వచ్చాను’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఈ ఫొటో వైరలవుతోంది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

News October 19, 2024

పోలీసులపైకి కుర్చీలు విసిరిన కార్యకర్తలు

image

సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. దీంతో లాఠీఛార్జ్ చోటు చేసుకోగా పలువురు గాయపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఇవాళ హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.